ఎస్ మూవీస్ క్రియేషన్స్ పతాకంపై నివాస్. కె. ఎస్., సందీప్తి, పద్మ ప్రధాన తారాగణంగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో కె.సంధ్యారాణి రూ పొందిస్తున్న చిత్రం ‘నాగినీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సంధ్యారాణి మాట్లాడుతూ, దర్శకుడు కథకు అనుగుణంగా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడికి నచ్చేలా తెరకెక్కించాడని, వైవిధ్యమైన పాము కథ కథనంతో నవరసభరితంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, పాము పాటలు హైలెట్‌గా వుంటాయని తెలిపారు.

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆమె అన్నారు. హర్షిత, వేణు, రాంబాబు, విజయ్, భాను, గోపాల్, సుమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు, సంగీతం:కె.ఎస్.నివాస్, కెమెరా: ఎ.సతీ ష్, కథ, మాటలు: సంధ్యారాణి.కె., ఎడిటింగ్: సతీష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.

Source: Andhrabhoomi - Telugu News Paper Portal
Next Post Newer Posts Previous Post Older Posts Home